
టెన్త్ పేపర్ లీక్ లో బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్ అరెస్ట్ చేసిన పోలీసులు ఆయనపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. రిమాండ్ రిపోర్టులో ఎ1 గా బండి సంజయ్ ని చేర్చారు. ఎ2 గా ప్రశాంత్, ఎ3 మహేష్, ఎ4 శివగణేష్ గా పోలీసులు రిమాండ్ రిపోర్టులో చూపించారు. ఏప్రిల్ 05 మంగళవారం అర్థరాత్రి సమయంలో సంజయ్ ను అరెస్ట్ చేసిన పోలీసులు కొద్దిసేపటి క్రితమే హనుమకొండ మెజిస్ట్రేట్ కోర్టు ముందు హాజరుపరిచారు. కాసేపట్లో కేసుపై విచారించనున్న కోర్టు సంజయ్ కు బెయిల్ ఇస్తుందా ? రిమాండ్ విధిస్తుందా అన్నది ఉత్కంఠగా మారింది.